నగర వాసులకు కాస్తంత ప్రశాంతత చేకూర్చే స్థలాలు పార్కులు. ఆపార్కులలో గమనిస్తే పచ్చటి ఆకారాలు కొన్ని కనిపిస్తాయి. కాసేపు చూడాలనిపిస్తుంటుంది. అటువంటివి మన ఇంటి వద్ద కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. ఇంటిముందు స్థలం ఉంటే ఇదేం పెద్ద కష్టం కాదంటున్నారు గార్డెనింగ్‌లో మెళకువలు కలిగినవారు. తక్కువ ఖర్చుతో పచ్చని తీగలతో ఆకట్టుకునే ఆకృతులను రూపొందించవచ్చని వారు చెబుతున్నారు.

స్థలానికి అనుగుణంగా...
మనకున్న స్థలానికి అనుగుణంగా ఆవరణకి అం దం తెచ్చేలా ఆకృతులను (వివిధ జంతువులు, ఆ కారాలు ) ఎంపిక చేసుకోవడంతో ఈ ప్రక్రియ ప్రారంభ మవుతుంది. తరువాత బొమ్మలను తయారుచేయడానికి అనువైన మొక్కలను ఎంచుకో వాలి. వాటికి ఎటువంటి తెగు లు రాకుండా ముందు జాగ్ర త్తగా ఎరువులు, జంతువుల బారినుంచి కాపాడేందుకు కంచెను ఏర్పాటు చేసు కోవాలి. ఇక నీటి నిల్వకు ఏర్పాట్లుచేసుకొని మొక్కలను నాటాలి.
ట్రిమ్మింగ్ చేసుకోవాలి...

ఎవరికైనా నచ్చుతుంది...
‘నాకు చిన్నప్పటినుంచి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నేను అమెరికాలో చదువు తున్నప్పుడు నేనుండే ఇంటిముందు ఉండే గార్డెన్ ఎంతో అందంగా ఉం డేది. రకరకాల పూల చెట్లతో పా టు, విభిన్న ఆకృతులను కూడా రూ పొందించారు. అక్కడ ఆ తోటను చూసినప్పుడు నా ఆసక్తి మరింత పెరిగింది.ఇండియాకు రాగానే మా ఇంటిముందుండే కొద్దిపాటి స్థలం లో మొక్కలు నాటి నాకిష్టమైన ఆకారాలను రూపొందించుకున్నా ను. అందుకు అవసరమైన సమాచారాన్ని, మెళు కువలను వేరేవాళ్లను అడిగి తెలుసుకున్నాను. నన్నుచూసి పక్కవారుకూడా అలాగే తయారు చేసుకోవడం మొదలు పెట్టారు.ఇవి పిల్లలనే కా కుండా ఎవరికైనా నచ్చుతాయి ’అని శ్రావ్య అన్నారు. వాటిని పెంచడం బ్రహ్మ విద్యేం కాదని అనుభవం ఉన్నవారు చెప్తున్నారు.
No comments:
Post a Comment